ఆ హీరో యాక్టింగ్ నచ్చలేదు.. స్టార్ హీరో పరువు తీసిన ఆర్జీవీ

frame ఆ హీరో యాక్టింగ్ నచ్చలేదు.. స్టార్ హీరో పరువు తీసిన ఆర్జీవీ

MADDIBOINA AJAY KUMAR
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండారు. ఈయనకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మకి మంచి క్రేజ్ ఉంటది. ఈయన నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి వర్మ వార్తల్లో మెరిశారు. ఇటీవల వర్మ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
'మోహన్ లాల్ నటన చాలా అద్బుతంగా ఉంటుంది. ఆయన సహజ నటుడు. ఆయనతో, నేను 2002లో కంపెనీ సినిమా చేశాను. నేను కంపెనీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మోహన్ లాల్ రియాక్షన్ చూసి షాకయ్యాను. అయితే నేను కంపెనీ కథ చెప్పడం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. అదే మొదటిసారి నేను ఆయనను కలవడం. మోహన్ లాల్ కథ చెప్పక.. తన పాత్ర గురించి చాలా సందేహాలు అడుగుతారని అనుకుని వెళ్లాను. కానీ కథ పూర్తి అవ్వగానే షూటింగ్ కి ఎన్ని రోజులు పడుతుందని మాత్రమే అడిగారు. అలా అడుగుతారని నేను అసలు ఊహించలేదు. నాకు తెలిసి దర్శకులందరితో ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారేమో. ఎందుకంటే మోహన్ లాల్ కి సినిమాపై చాలా అవగాహన ఉంది. అలాగే ఆయన దర్శకులపై చాలా నమ్మకం ఉంచుతారు' అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
'ఘాట్ జరిగే సమయాల్లో కూడా ఇబ్బందులు వచ్చాయి. ఓ సీన్ లో ఆయన నటన నాకు అసలు నచ్చలేదు. సీన్ కి తగ్గట్టు నటించినట్లు అనిపించలేదు. దీంతో ఆ సీన్ ని సుమారు ఏడు, ఎనిమిది టేకులు చేశాం. అయిన కూడా ఆయన తొలి టేక్ లో నటించిన షాట్ యే బాగా అనిపించింది. నిజంగా ఆయన సహజ నటుడు. సీన్స్ వివరిస్తే చాలు దర్శకుడికి నచ్చేటట్లు యాక్టింగ్ చేస్తారు' అని తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: