టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆ తర్వాత ఈ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం సమ్మర్లో మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అనేక వార్తలు అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా మే 9 వ తేదీన కూడా విడుదల అయ్యే అవకాశాలు లేవు అని ఓ వార్త వైరస్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ , నిహారిక కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... నిహారిక మాత్రం ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నిహారిక , చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మరోసారి ఈమె చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.