హీరోయిన్ తో ప్రేమలో పడ్డ సందీప్ కిషన్.. లైవ్ లో ముద్దులు పెడుతూ..?

frame హీరోయిన్ తో ప్రేమలో పడ్డ సందీప్ కిషన్.. లైవ్ లో ముద్దులు పెడుతూ..?

Pandrala Sravanthi
టైర్ -2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకోవడం కోసం నటుడు సందీప్ కిషన్ ఎంతలా ఆరాట పడుతున్నారో చెప్పనక్కర్లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో మన ముందుకు వస్తూ ఒక్క సినిమా అయినా హిట్టు కొడుతున్నారు.అలాగే గత ఏడాది ధనుష్ హీరోగా చేసిన రాయన్ మూవీలో ధనుష్ తమ్ముడి పాత్రలో నటించారు.అలాగే ఊరి పేరు భైరవకోన సినిమాలో హీరోగా చేశారు. అయితే ఈ రెండు సినిమాలు హిట్టు కొట్టడంతో నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారుప్రస్తుతం సందీప్ కిషన్ ధమాకా డైరెక్టర్ త్రినాధరావు నక్కినతో మజాకా అనే మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ మూవీ ఈవెంట్లో మాట్లాడి డైరెక్టర్ కాంట్రవర్సీకి గురయ్యారు. ఈ విషయం పక్కన పెడితే..తాజాగా సందీప్ కిషన్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని,లైవ్ లోనే ముద్దులు పెడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 


అంతేకాదు ఆ హీరోయిన్ కి సందీప్ కిషన్ ముద్దు పెట్టిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సందీప్ కిషన్ ఏ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారంటే నటి రీతూ వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో స్టార్డం సంపాదించిన రీతూ వర్మ పలు సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తోంది. గత ఏడాదిలో స్వాగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మజాకా మూవీతో మన ముందుకు రాబోతుంది.అయితే తాజాగా రీతు వర్మ వాలెంటైన్స్ డే రోజు బేబీ మా అనే సాంగ్ కి రీల్ చేస్తున్న సమయంలో మధ్యలో సందీప్ కిషన్ వచ్చి ఆమె చెంపలపై ముద్దు పెట్టారు.


 అయితే హీరోయిన్ బుగ్గలపై సందీప్ కిషన్ అంత ధైర్యంగా ముద్దులు పెట్టారంటే వారి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది. అందుకే లైవ్ లోనే ముద్దు పెట్టేసారు ఇద్దరి మధ్య ఏం లేకపోతే అంత ధైర్యంగా ముద్దెలా పెట్టుకుంటాడు అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాదు సందీప్ కిషన్ రీతూ వర్మ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ తేల్చేస్తున్నారు.ఇక మరికొంత మందేమో మజాకా మూవీ ఫిబ్రవరి 26 న విడుదల కాబోతుంది కాబట్టి ఇలా చేస్తే సినిమాకు ప్రమోషన్ అవుతుందని అలా వీడియో చేశారు కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: