మహేశ్‌బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇటీవల మొదలైన పంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రాజమౌళి హీరో మహేశ్‌బాబు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఓ వీడియోను షేర్ చేయడంతో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టినల్లు తెలుస్తోంది. జక్కన్న సినిమా అంటే సినిమాకు సంబంధించి ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఈ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్ట్‌ల గురించి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఆ రకంగా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారు. కథ విషయంలో కూడా కథా రచయిత రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే తప్ప దర్శకుడిగా రాజమౌళి ఎక్కడా నోరు విప్పలేదు. జస్ట్ సినిమా జానర్ మాత్రం చెప్పారు. ఎంతో పకడ్భందీగా సినిమా మొదలుపెట్టారు. ఈ విషయంలో చిత్ర బృందానికి గట్టిగానే హెచ్చరికలు జారీచేసినట్లు చిత్ర యూనిట్ నుంచి తెలిసింది.ఇందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు పలు ఇంగ్లిష్ మీడియా సంస్థలు కథనాలు రాశాయి.ఇదిలావుండగా ప్రియాంక చోప్రా క్యారెక్టర్ కు రాజమౌళి స్పెషల్ లేయర్స్ ఇచ్చాడన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె క్యారెక్టర్‌లో కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే రూమర్స్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌లో ట్విస్ట్ ఉండడం కామన్ కాబట్టి, ప్రియాంక పాత్ర కూడా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుందనడంలో సందేహం లేదు. మరొక వైపు, ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో, మ్యూజిక్ కూడా సినిమాకు మరో ఎస్సెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.ఇక దీని పై అధికారిక ప్రకటన రావాల్సివుంది.