RC 16 : స్టోరీ పై ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చిన రత్నవేలు..!!

frame RC 16 : స్టోరీ పై ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చిన రత్నవేలు..!!

murali krishna
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత సోలోగా వచ్చిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ  సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.భారీ అంచనాల తో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో మెగా అభిమానులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.అయితే చరణ్.. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో RC 16 పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రీసెంట్ గా మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తేలిసిందే.ఇదిలావుండగా rc16 షూటింగ్ ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ పూర్తియింది.కొద్ది రోజుల క్రితం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వగా అదే సమయంలో మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. అందరిలో ఆసక్తి రేపేలా పోస్ట్ పెట్టారు. మూవీ షూటింగ్ జరుగుతున్న పిక్ ను షేర్ చేశారు. పెద్ద ఫ్లడ్ లైట్స్.. భారీ వెలుగులతో నైట్ టైమ్ షూటింగ్ జరుగుతున్నట్లు పిక్ ద్వారా తెలుస్తోంది.అయితే ఆయన ఇచ్చిన క్యాప్షన్ అందరిలో ఆసక్తి రేపుతోంది. "నైట్‌ షూట్‌, ఫ్లడ్‌ లైట్స్‌, క్రికెట్‌ పవర్‌, డిఫరెంట్‌ యాంగిల్స్‌" అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు రత్నవేలు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో నెటిజన్లు, మెగా అభిమానులు స్పందిస్తున్నారు. ఫుల్ గా కామెంట్లు పెడుతున్నారు.
రత్నవేలు క్యాప్షన్స్ బట్టి చూస్తుంటే రాత్రి సమయంలో తీయాల్సిన సీన్స్ ను ప్రస్తుత షెడ్యూల్ లో బుచ్చిబాబు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. దీంతో టీమ్ కు కొద్ది రోజుల పాటు నిద్ర లేనట్లే అదే సమయంలో రత్నవేలు.. క్రికెట్ పవర్ అంటూ పోస్ట్ చేయగా సినిమా ఆ బ్యాక్ డ్రాప్ లో రూపొందతున్నట్లుందని అంతా అంచనా చేస్తున్నారు.
అయితే చరణ్ ను సినిమాలో పవర్ ఫుల్ గా చూపించేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రా అండ్ రస్టిక్ గా చూపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే చరణ్ మేకోవర్ అవుతున్నట్లు క్లియర్ గా కనబడుతోంది. ఫుల్ గా వర్కౌట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇక మూవీ విషయానికొస్తే.. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ తో కలిసి బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ గ్రాండ్ గా నిర్మిస్తోంది. మరి RC 16 ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: