
అంబటి బిగ్ ప్లాన్.. కూటమిని రెచ్చగొడుతున్నారా..!
గత ఏడాది ఎన్నికల్లో ఓడిన తర్వాత.. అంతో ఇంతో ఆత్మ విచారం చేసుకుని. తప్పులు సరిచేసుకునే ప్రయత్నాలు చేయాలి. కానీ, అంబటి తీరు చూస్తే.. దానికి భిన్నంగా ఉంది. అంతేకాదు.. ఆయన వ్యవహ రిస్తున్న తీరు కూడా.. వివాదాలను కావాలని రెచ్చగొడుతున్నట్టే ఉండడం గమనార్హం. రెడ్‌బుక్ పేరుతో మరోసారి అంబటి చేసిన వ్యాఖ్యలను కూటమి సర్కారును బెదిరిస్తున్నట్టుగా.. రెచ్చగొడుతున్నట్టు గా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
`రెడ్ బుక్ చూసి ఆ ఇంటి కుక్క కూడా భయపడదు` అని అంబటి చేసిన వ్యాఖ్యలపై కూటమి పెద్దలు దృష్టి పెట్టారు. ఒకవైపు రెడ్ బుక్ తీస్తే.. రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ. ఎదురు దాడి చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం ప్రశాంతంగా పనిచేసుకుంటే.. రెచ్చగొడుతున్నారు. ఈ పరిణామాల వెను క పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి అలజడి లేదు. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం కూడా సాధారణ పరిస్థితిలోనే పనిచేసుకుంటున్నాయి.
కానీ, ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా.. అంబటి.. పెట్టుబడులపై ప్రభావం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే సమయం ఆసన్నమైంది. అన్ని దారులను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే పెట్టుబడులు వస్తాయన్న సంకేతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో రెడ్ బుక్ పేరుతో.. చేస్తున్న యాగీతో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా కూటమిని దెబ్బకొట్టే ప్లాన్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.