నేడు ఒక్కరోజే ఓటీటీలోకి 15 చిత్రాలు ..లిస్ట్ ఇదే

frame నేడు ఒక్కరోజే ఓటీటీలోకి 15 చిత్రాలు ..లిస్ట్ ఇదే

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే స్టార్ హీరో, నట రాజా సింహా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా విడుదల అయ్యి.. మంచి హిట్ కొట్టింది.
ఇక తాజాగా ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా విడుదల అయ్యింది. ఇక అలా రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక నేడు ఒక్కరోజే మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఇవే.. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో పుష్ప 2, ఫేస్ లెస్ మూవీ, లుక్కాస్ వరల్డ్, ది స్నో గర్ల్ 2, హియర్ మూవీ, ది రిక్రూట్ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో బ్రీచ్, గుడ్ రిచ్, ఫ్రైడే నైట్ లైట్స్, సింగ్ సింగ్ మూవీ, యువర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ మూవీ రిలీజ్ అవుతుంది.
జీ5 ఓటీటీలో ఐడెంటిటీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సాలే ఆషిక్ హిందీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఈటీవీ విన్ లో పోతుగడ్డ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సింప్లీ సౌత్ ఓటీటీలో ఎమక్కు తొజిల్ రొమాన్స్ సినిమా రిలీజ్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: