ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు. ఈయన తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అనేక ఇతర భాష సినిమాలకు కూడా సంగీతం అందించాడు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు కొన్ని తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించాడు. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం గౌతమ్ తిన్ననూరి , నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా జెర్సీ అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సంగీతానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే గౌతమ్ తిన్ననురి తాజాగా మ్యాజిక్ అనే ఓ చిన్న సినిమాలు రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఏకంగా 8 పాటలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ చిన్న సినిమా కోసం అనిరుద్ 8 పాటలను అందించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ ఒక్కో పాటను కాకుండా ఒకే సారి మొత్తం ఎనిమిది పాటలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే గౌతమ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా "VD 12" అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరం గౌతమ్ దర్శకత్వం వహించిన మ్యాజిక్ మరియు VD 12 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే గౌతమ్ , అనిరుద్ కాంబోలో వచ్చిన జెర్సీ సినిమా మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో వీరి కాంబోలో ప్రస్తుతం రూపొందుతున్న మ్యాజిక్ , VD 12 ఆల్బమ్స్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.