
ఆ మాట అంటే విలన్ లా చూశారు.. స్టార్ హీరో విశాల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
గతంలో కూడా తాను ఈ విషయం చెప్పనని విశాల్ పేర్కొన్నారు. డబ్బులు ఉన్న వాళ్లంతా సినిమా చేసే అవకాశం అయితే ఉందని కాకపోతే అందరికీ లాభాలు వస్తాయనే నమ్మకం మాత్రం లేదని విశాల్ వెల్లడించారు. గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండే పరిస్థితి గురించి నేను మాట్లాడానని విశాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో అందరూ నన్ను విలన్ గా చూశారని విశాల్ వెల్లడించడం గమనార్హం.
ఒక సినిమాను తెరకెక్కించాలంటే కోటి రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోందని విశాల్ పేర్కొన్నారు. ఆ డబ్బులను పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చేయాలని లేదంటే భూమిని కొనుగోలు చేయాలని విశాల్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ మాత్రం బాలేవని విశాల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి నిజాలను ఎవరూ బయటికి వచ్చి చెప్పరని విశాల్ అన్నారు.
విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చని వారి వద్ద అంత డబ్బు ఉందని కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదని విశాల్ వెల్లడించారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు అని విశాల్ పేర్కొన్నారు. గతేడాది కోలీవుడ్ ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల రూపాయలు నష్టపోయింది. తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ల సంఖ్య కూడా తక్కువనే సంగతి తెలిసిందే. తమిళనాడులో సినిమాల పరిస్థితి ఈ విధంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.