
ఆ ఒక్క రీజన్‌తో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ .. మారుతి ఫెయిల్యూర్స్ కు కారణం ఇదే..!
ప్రజెంట్ మన టాలీవుడ్ లో కామెడీ సినిమాలు తీసిన డైరెక్టర్లు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి , మారుతి. ఇద్దరు దర్శకుల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు . ఇద్దరు కూడా తమ సినిమాల్లో ఎక్కువ కామెడీ కే పెద్దపీట వేసి ప్రెక్షకులను నవ్విస్తారు. అయితే ఈ ఇద్దరి దర్శకులలో మారుతి దగ్గర నుంచి వచ్చే సినిమాల్లో మాత్రం కామెడీతో పాటు వల్గారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది .. ఈ ఒక్క రీజన్ తో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ దర్శకుడు సినిమాలు చూడడానికి కొంత మొహమాటపడుతున్నారు. ఈ ఒక్క రీజన్ తోనే మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు .
ఇక అనిల్ రావిపూడి సినిమాలు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. అనిల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కానీ ఆ సన్నివేశాలు నాచురల్ గా ఫన్నీగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి .. ఈ కారణంగానే అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు మారుతి కూడా ప్రెసెంట్ ఫామ్ లోకి రావడానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమాతో తన హారర్ కామెడీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాతో అయినా మారుతి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.