కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో విశాల్ ఒకరు. ఇకపోతే విశాల్ తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేయగా అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే విశాల్ చాలా సంవత్సరాల క్రితం సుందర్ సి దర్శకత్వంలో మద గజ రాజా అనే తమిళ సినిమాను మొదలు పెట్టాడు.
ఇక ఈ సినిమా మొదలు అయిన తర్వాత కొంత కాలానికి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన కూడా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను విడుదల చేయలేదు. ఈ మూవీ ఏకంగా పూర్తి అయిన 12 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పొంగల్ కానుకగా తమిళ భాషలో విడుదల అయింది. ఇక చాలా సంవత్సరాల క్రితం పూర్తి అయిన సినిమా కావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ చూపదు అని కూడా చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ అనూహ్యంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తమిళ బాక్సా ఫీస్ దగ్గర ఏకంగా 50 కోట్ల కలెక్షన్లను కూడా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను జనవరి 31 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి అంజలి , వరలక్ష్మి శరత్ కుమార్ , విశాల్ కి జోడిగా నటించారు.