ఇస్మార్ట్ జోడీలో కంటతడి పెట్టుకున్న లాస్య

frame ఇస్మార్ట్ జోడీలో కంటతడి పెట్టుకున్న లాస్య

MADDIBOINA AJAY KUMAR
ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి.
అందులో సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. మొదటి నుండి ఇప్పటివరకు ఈ షోలో టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు. అయితే ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ప్రేరణ, శ్రీ పాద్ వచ్చారు. ఇదిలా ఉండగా.. లాస్య షోలో ఎమోషనల్ అయ్యింది. లాస్యమంజునాథ్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇప్పటివరకు లక్ అనే పదాన్నే చూడలేదని చెప్పింది. ఏ ఒక్కసారి కూడా తన జీవితంలో అనుకున్నదేది అనుకున్నట్లు అవ్వలేదని చెప్తూ కంటతడి పెట్టుకుంది.        
ఇక తెలుగు టీవీ షోలకు సంబంధించి తాజాగా 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. స్టార్ మా ఛానెల్ లో అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలన్నీ తిరుగులేని రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి. అయితే స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇస్మార్ట్ జోడీ షో టాప్ 1 లో నిలిచి ప్రేక్షకుల మనసు మరోసారి గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: