అలాంటి ఫోటోస్ షేర్ చేసి.. రొమాన్స్ కావాలంటున్న బుట్టబొమ్మ

frame అలాంటి ఫోటోస్ షేర్ చేసి.. రొమాన్స్ కావాలంటున్న బుట్టబొమ్మ

MADDIBOINA AJAY KUMAR
గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి పరిచయం అనవసరం. ఈమె మోడల్, నటి. పూజా 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది. ఆతర్వాత పూజ రాధేశ్యామ్‌‌, బ్యాచిలర్, దువ్వాడ జగన్నాధం సినిమాలలో కూడా నటించింది.
పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. హీరో షాహిద్ కపూర్ దేవా సినిమా ఈ నెల చివర్లో థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఈమె సల్మాన్ ఖాన్ తో ఓ మూవీ చేసి ఫ్లాప్ అనిపించుకుంది. అయితే ఈమె ఇప్పుడు నార్త్ లో చేసిన సినిమా హిట్ కొడుతుందో.. లేక ఫట్ అవుతుందో చూడాలి మరి.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అందాల భామ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఆమె బ్లాక్ మోడ్రన్ డ్రెస్ లో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది. కొంచెం రొమాన్స్ చేస్తే చాలు అని ఆ పోస్ట్ కి క్యాప్షన్ జోడించింది. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: