![దయచేసి ఫోటోలు తీయకండి..కరీనా రిక్వెస్ట్.. కారణం అదేనా?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/movie-6ab1dd20-b502-4ad4-b48f-7130c8951359-415x250.jpg)
దయచేసి ఫోటోలు తీయకండి..కరీనా రిక్వెస్ట్.. కారణం అదేనా?
కపూర్ ఖాన్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు. కరీనా ఫ్యాషన్ శైలికి గుర్తింపు పొందింది. చలనచిత్ర నటనతో పాటు, కపూర్ స్టేజ్ షోలలో కూడా పాల్గొంటుంది. రేడియో షోను నిర్వహిస్తుంది మరియు రెండు స్వీయచరిత్ర జ్ఞాపకాలు మరియు రెండు పోషకాహార మార్గదర్శకాల పుస్తకాలకు సహ రచయితగా సహకరించింది. చెప్పుకుంటూ పోతే ఈ భామ గురించి చాలానే ఉన్నాయి.
అయితే తాజాగా కరీనా కపూర్ ఫొటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేశారు. తన పిల్లలు తైమూరు, జేహ్‌ల గార్డెన్ పుట్టినరోజు వేడుకల్లో, క్రీడా కేంద్రాల్లో ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తీయొద్దని ఆమె చెప్పుకొచ్చారు. వారి ఫొటోల కోసం కూడా వారి నివాసం వద్ద ఉందకోడదని పీఆర్ టీమ్ తెలిపిందని అన్నారు. కావాలంటే ఏదైనా ఈవెంట్ లో కనిపిస్తే వారి చిత్రాలు తీసుకోవచ్చని తెలిపింది.
ఇక కరీనా కపూర్ భర్త ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇతర ఇండస్ట్రీలకి చెందిన ప్రముఖులు కూడా ఈ దాడిపై స్పందించిన సంగతి తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన సహా తదనంతర పరిణామాలపై మీడియా ప్రసారం చేస్తున్న కథనాలపై కరీనా కపూర్ మండిపడిన విషయం తెలిసిందే.