బాలయ్యతో ఏజ్ గ్యాప్.. షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్!

frame బాలయ్యతో ఏజ్ గ్యాప్.. షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్!

MADDIBOINA AJAY KUMAR
నటి ప్రగ్యా జైస్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈమె తెలుగు సినిమాలతో పాటుగా హిందీ చిత్రాలలో కూడా నటించారు. ఈ భామ చాలా వరకు బాలకృష్ణతోనే కనిపించింది. బాలయ్య బాబు అఖండ, డాకూ మహారాజు సినిమాలలోనే ఈమె నటించి.. ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల ప్రగ్యా జైస్వాల్ కి, బాలయ్య బాబుకి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందని అంటున్నారు.  బాలయ్యకు 64 ఏళ్లు, ప్రగ్యా జైస్వాల్ కి 37 ఏళ్లు.. ఇద్దరి మధ్య 27 ఏళ్ల గ్యాప్ ఉంది. అలా ఉన్న కూడా ఇద్దరు కలిసి నటించడం సరి కాదంటూ ప్రేక్షకులు కొందరు విమర్శించారు.
అయితే ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఈ విషయంపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. 'బాలయ్యతో కలిసి నటించడం స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తుంది. పాజిటివిటీని కూడా అందిస్తుంది. బాలకృష్ణ దగ్గర నుండి నేర్చుకునేవి చాలా ఉంది. కెమెరా ఆన్, ఆఫ్ మధ్యలో సులభంగా ఎలా మారొచ్చో ఆయన లాంటి లెజెండ్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. బాలయ్యకు ఎలాంటి ఫిల్టరస్ ఉండవు. ఆయన చాలా గౌరవంగా ఉంటారు.. అలాగే అందరినీ ఒకేలాగా, సమానంగా చూస్తారు. బాలయ్య బాబు చాలా మంచి వ్యక్తి. అలాగే తోటి నటులకు చాలా సహకారం అందించే నటుడు. మా ఇద్దరి ఏజ్ గ్యాప్ గురించి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ అది అంతా పెద్ద విషయం కాదు. స్క్రీన్ మీద బాగా కనిపిస్తే చాలు. పాత్రను ఎలా రాశారన్న దానిపై నటీనటులను తీసుకుంటారని నేను అనుకుంటా. పాత్రకు న్యాయం చేయగలిగితే చాలు. ఇక ఏజ్ గ్యాప్‍ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది' అని ప్రగ్యా జైస్వాల్ పాజిటివ్ గా సమాధానం ఇచ్చారు. అలాగే డాకూ మహారాజు మూవీ తర్వాత ఆమెని అందరూ డాకూ మహారాణి అంటున్నారని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో గర్బిణిగా నటించడం తనకు చాలా కొత్తగా అనిపించిందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: