ప్రస్తుత జనరేషన్ లో ఒక సినిమా 50 రోజులు ఆడడమే కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ఒక సినిమా హౌస్ ఫుల్ బోర్డ్ తో ఒక నెలపాటు ఆడితే చాలు హిట్టే అంటున్నారు. కానీ ఒకప్పుడు సినిమాలు మాత్రం100, 200,300,500 ఇలా చెప్పుకుంటూ పోతే వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుండి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి,బాలకృష్ణ వంటి ఎంతో మంది హీరోల సినిమాలు చాలా చోట్ల 100 రోజులు 200 రోజుల సెలబ్రేషన్స్ చేసుకున్నాయి. అయితే ఈ జనరేషన్ లో బాలకృష్ణ నటించిన ఒక సినిమా వెయ్యి రోజులు ఆడింది అంటే ఆశ్చర్యమే అని చెప్పాలి.మరి ఇంతకీ బాలకృష్ణ నటించిన ఏ సినిమా 1000 రోజులు ఆడిందో ఇప్పుడు చూద్దాం.బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.
అయితే అలా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూవీ లెజెండ్.. వరుస ప్లాప్ తో ఇబ్బంది పడుతున్న బాలకృష్ణకి లెజెండ్ మూవీ కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో బాలకృష్ణ మళ్ళీ ఇండస్ట్రీలో కంబ్యాక్ అయిపోయారు. అయితే ఈ సినిమా ఓ థియేటర్లో మాత్రం ఏకంగా 1005 రోజులు ఆడిందట.అయితే ఒక సినిమా 100 రోజులు ఆడడమే ఎక్కువ అంటే ఈ సినిమా ఏకంగా వెయ్యి రోజులు అది కూడా నాలుగు షోలతో ఈ సినిమా 2014 నుండి 2017 వరకు ఎలాంటి అడ్డు లేకుండా నిరంతరాయంగా ఆడిందట.
అయితే ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని ఓ థియేటర్లో లెజెండ్ మూవీ 1005 రోజులు ఆడి బాలకృష్ణ కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాగా పేరు తెచ్చుకుంది. అలా 1005 రోజులు ఆడిన సినిమాగా బాలకృష్ణ సినీ కేరీర్లో లెజెండ్ మూవీ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. రాధిక ఆప్టే, సోనల్ చౌహన్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో జగపతిబాబు మొదటిసారి ఈ సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు