కొన్ని సినిమాల కథలకు మొదట ఒక హీరో అనుకుంటే చివరికి మరో హీరో నటిస్తాడు. అలా నటించిన సినిమా ఫ్లాప్ అయితే మిస్ చేసుకున్న హీరో బాధపడరు కానీ ఒకవేళ సూపర్ హిట్ అయ్యిందంటే ఆ సినిమాను గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. టాలీవుడ్ లో అలా చాలా సినిమాలకు మొదట ఒక హీరోను అనుకుని ఆ తరవాత మరో హీరో నటించి హిట్ కొట్టారు. ఆ సినిమాలలో ఒకటి రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా. ఈ సినిమా కథ మొదట దర్శకుడు బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారు.
బోయపాటి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సినిమా కథను చాలా చక్కగా చెప్పారట. కానీ ఎక్కువగా వయోలెన్స్ ఉన్నట్టు చెబుతూ సీన్లను వివరించే సరికి ఎన్టీఆర్ సైతం భయపడిపోయారట. ఆ తరవాత బోయపాటి మళ్లీ ఎన్టీఆర్ వద్దకు రాలేదట. ఇక ఇదే కథను బోయపాటి అల్లు అర్జున్ కు సైతం వివరించారు. ఓ సినిమా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఈ విషయాన్ని వెల్లడించారు. బోయపాటి తన వద్దకు భద్ర సినిమా కథ చెప్పారని కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని బాధపడ్డారు.
ఇక ఈ సినిమా మిస్ చేసుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో బోయపాటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో బోయపాటి దమ్ము సినిమా చేయగా ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అంతే కాకుండా అల్లు అర్జున్ తో బోయపాటి సరైనోడు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలించింది. ఇక ప్రస్తుతం బోయపాటి బాలయ్య హీరోగా అఖండ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో అఖండ 2పై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కొంత షూటింగ్ పార్ట్ ను ఇటీవల కుంభమేళలో సైతం తెరకెక్కించారు. మరి ఈ సినిమా బోయపాటికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.