మగధీర : 50 డేస్ సెంటర్స్ లెక్క ఇదే.. సూపర్ సాలిడ్ రికార్డ్..?

frame మగధీర : 50 డేస్ సెంటర్స్ లెక్క ఇదే.. సూపర్ సాలిడ్ రికార్డ్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని తన నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చరణ్ తన రెండవ సినిమాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2009 వ సంవత్సరం జులై 30 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి చాలా రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును కలెక్షన్లను డబుల్ మార్జిన్ తో క్రాస్ చేసి అదిరిపోయే రేంజ్ ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకుంది.


ఇది ఇలా ఉంటే ఈ సినిమా కేవలం కలెక్షన్ల విషయంలో మాత్రమే కాకుండా అనేక కొత్త కొత్త విషయాలలో కూడా రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా 50 డేస్ సెంటర్స్ విషయంలో కూడా మంచి రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏకంగా 302 సెంటర్స్ లో 50 రోజులను కంప్లీట్ చేసుకుని అద్భుతమైన రికార్డును సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించగా ... ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.


ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... శ్రీహరి , సలోని , సునీల్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. దేవ్ గిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: