తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
ఇకపోతే 2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి కలెక్షన్ల పరంగా కొత్త కొత్త రికార్డులను సృష్టించడం మాత్రమే కాకుండా 50 డేస్ సెంటర్స్ విషయంలో కూడా అద్భుతమైన రికార్డును సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 37 సెంటర్లలో 50 రోజులను కంప్లీట్ చేసుకుని అద్భుతమైన రికార్డును సృష్టించింది.
ఇలా ఈ సినిమా కలెక్షన్లతో పాటు 50 డేస్ సెంటర్స్ విషయంలో కూడా మంచి రికార్డును సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో మణిశర్మ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇకపోతే ఈ సినిమాలో నాజర్ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాలో మహేష్ , ఇలియానా జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకులు నుండి వచ్చాయి.