
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఇష్టాలు ఇవే
ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు. ఇటీవల నిఖిల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నిఖిల్ మాట్లాడుతూ.. తనను నిక్కీ, చెర్రీ, కంద అనే మూడు ముద్దు పేర్లు ఉన్నాయని చెప్పాడు. అలాగే ఆయనకి చికెన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. ఇక వీరిద్దరూ మళ్లీ ఇద్దరు కలుస్తారని.. ఫాన్స్ ఆశిస్తున్నారు.