టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల లో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదిలి పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇకపోతే చిరంజీవి ఈ మధ్య కాలంలో కూడా ఓ రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఆ సినిమాలలో ఓ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా మరో సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
తాజాగా విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మొదట వెంకటేష్ పాత్రకు అనిల్ రావిపూడి , చిరంజీవి ని అనుకున్నట్లు కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.
ఇకపోతే సందీప్ కిషన్ , రావు రమేష్ ప్రధాన పాత్రలలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర కోసం మొదట చిరంజీవిని మేకర్స్ అనుకున్నారట. ఆయన మొదట ఓకే చెప్పినా కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఆ పాత్రను రిజెక్ట్ చేశాడట. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.