కృష్ణంరాజును బట్టలు చిరిగేలా కొట్టిన జూనియర్ ఆర్టిస్టులు.. రెబల్ స్టార్ ఘోరఅనుభవం.. కారణం అదేనా.. !

frame కృష్ణంరాజును బట్టలు చిరిగేలా కొట్టిన జూనియర్ ఆర్టిస్టులు.. రెబల్ స్టార్ ఘోరఅనుభవం.. కారణం అదేనా.. !

Amruth kumar
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ ఉందో తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. వయస్సు రిత్యా ప‌లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను నటించి మెప్పించాడు. ఇక సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు రాణిస్తున్న‌ నేపథ్యంలో వాళ్లకు దీటుగా పోటీ ఇస్తూ తన సినిమాలతో మెప్పించాడు. రెబల్ స్టార్ గా మంచి ఇమేజ్ను దక్కించుకున్నాడు. యాక్షన్ సినిమాలో ఎక్కువగా మెప్పించిన హీరో గానే కాదు, విలన్ గాను పలు సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో విలన్ వేషాల్లో చేసిన కృష్ణంరాజు.. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు. తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా కనిపించాడు. ఎక్కువగా యాంగ్రీ మ్యాన్ లుక్ లో ఆవేశంతో కూడిన పాత్రలో ఆయన సక్సెస్ అందుకున్నాడు.

 
అలాంటి కృష్ణంరాజును ఓ సినిమా సెట్ లో జూనియర్ ఆర్టిస్టులు షర్ట్ చినిగేలా కొట్టారట. సినిమా కో డైరెక్టర్ చేసిన పనికి కృష్ణంరాజు వాళ్ల చేత దెబ్బలు తినాల్సి వచ్చిందట‌. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కృష్ణంరాజు తన కెరీర్ స్టార్టింగ్‌లో మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకి బివి ప్రసాద్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. దాసరి నారాయణరావు డైలాగ్స్ రాయగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ సాగ‌ర్ అసోసియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇక ఇందులో నాగభూషణం హీరోగా చేశారు. కృష్ణంరాజుది కీలక పాత్ర. అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ కానీ కృష్ణంరాజు బతుట పాత్రలో కనిపించాడు. తుగ్లక్ నాగభూషణం పాత్రలో మంచివాడు కాదని ఆయన ప్రచారం చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో విషయం తగ్లక్‌కి తెలిసి ఆయన పోనీలే పిచ్చోడు వదిలేయండి అని తన మనుషులతో అంటాడట.

 
కానీ వాళ్ళు అంతా చితక్కొట్టాల్సిన సీన్ ఉంది. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్టులు అంతా ఆయనను నిజంగానే చొక్కా చినిగేలా చితకభాదరట. అయితే దీని వెనక అసలు కారణం మరోటి ఉంది. కృష్ణంరాజుది భారీ పర్సనాలిటీ కావడంతో.. ఆయన్ని కొట్టాలంటే జూనియర్ ఆర్టిస్టులు కాస్త ఇబ్బంది పడేవారుట. కానీ.. అసోసియేటివ్ డైరెక్టర్ సాగర్ వారు సరిగా కొట్టడం లేదని కోపంతో కొట్టండి అని గట్టిగా అరిచాడట. అంతే ఆవేశంతో నిజంగానే జూనియర్ ఆర్టిస్టులు కృష్ణంరాజును చితక బాదేసారట. ఈ దెబ్బకి ఆయన ఒళ్లంతా హూనమైపోయి ఎర్రగా మారిపోయిందని.. దీంతో కృష్ణంరాజు గారు స్వయంగా సాగర్ దగ్గరకు వెళ్లి తనని బాగా తిట్టాడని ఓ యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో సాగ‌ర్‌ స్వయంగా వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: