నేడు మోహన్ బాబు యూనివర్సిటీకీ మనోజ్.. మళ్లీ టెన్షన్ టెన్షన్?
ఇక సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటా ఇటీవల విభేధాలు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే మరోసారి ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. ఇటీవల మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి మంచు కుటుంబం గురించి వరుస వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే గతంలో మంచు విష్ణు, మనోజ్ కొట్టుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేస్తాడని మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో రియాలిటీ షోలో భాగంగా తీసింది అని మంచు విష్ణు కవర్ చేశారు. ఇక ఈ గొడవల మధ్యలో మంచు మనోజ్, మంచు మోహన్ బాబు యూనివర్సిటీ కి వెళ్లడంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.. అలాగే హై టెన్షన్ నెలకొంది.