2025 సంక్రాంతి చాలా అద్భుతంగా ముగిసిందని చెప్పవచ్చు. ప్రజలంతా ఎంతో అద్భుతంగా పండగ జరుపుకోవడమే కాకుండా ఈ పండగ బరిలో మూడు అద్భుతమైన చిత్రాలు నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జనవరి 10వ తేదీన వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో కాస్త వసూళ్లు తగ్గాయి. ఇక దీని తర్వాత వచ్చినటువంటి చిత్రం బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్.. ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. ఆ తర్వాత సంక్రాంతి రోజున వచ్చినటువంటి క్రేజీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.. వెంకటేష్ హీరోగా వస్తున్నటువంటి ఈ చిత్రం అద్భుతమైన టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది.
ఇలా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఈ మూడు చిత్రాలపై బుక్ మై షో ట్రాకింగ్ నిర్వహించింది.. వీరు నిర్వహించిన టాస్క్ లో ఒక గంటలో ఏ సినిమాకు ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయ్యో తెలియజేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం రామ్ చరణ్ హీరోగా వచ్చినటువంటి గేమ్ చేంజర్ మూవీ గంటలో కేవలం 1,810 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ గంట సమయంలో 3,380 టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే వెంకటేష్ హీరోగా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం గంటలో 8,390 టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ విధంగా టాప్ లెవల్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నిలిచిందని చెప్పవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మంచి టాక్ తో దూసుకుపోతోంది. దీని తర్వాత డాకు మహారాజు ఉంది. ఇక చివరి స్థానంలో గేమ్ చేంజర్ నిలిచింది. ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజు చిత్రాల ముందు గేమ్ చేంజర్ తేలిపోయిందని చెప్పవచ్చు.