సంక్రాంతికి మూవీ లవర్స్ కు పండగే పండగ.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయంటే?

frame సంక్రాంతికి మూవీ లవర్స్ కు పండగే పండగ.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయంటే?

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే స్టార్ హీరో, నట రాజా సింహా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా విడుదల అయ్యి.. మంచి హిట్ కొట్టింది.
ఇక తాజాగా ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా విడుదల అయ్యింది. ఇక అలా రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక ఈ సంక్రాంతికి మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో జనవరి 15 నుండి పబ్లిక్ డిజార్డర్ సీజన్ 1(హాలీవుడ్ మూవీ) స్ట్రీమింగ్ కానుంది. కింగ్డమ్: రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ జనరల్ అనే మరో హాలీవుడ్ సినిమా ఈ వారంలో రిలీజ్ కానుంది. విత్ లవ్ మేఘన సీజన్ 1 (హాలీవుడ్) కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక జనవరి 16 వ తేదీ నుండి లవర్స్ అనానిమస్ (హాలీవుడ్ మూవీ) స్ట్రీమింగ్ కానుంది. గ్జో కిట్టి సీజన్ 2 కూడా రిలీజ్ అవ్వనుంది. బ్యాక్ ఇన్ యాక్షన్(హాలీవుడ్ మూవీ) జనవరి 17 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది
ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తమిళ్ లో జనవరి 14 నుండి సూదుకవ్వుమ్ 2 సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్ మూవీ జనవరి 17 న రిలీజ్ అవ్వనుంది. ఇక అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే.. బ్లడీ యాక్స్ ఉండ్(హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే క్రావెన్ ది హంటర్(హాలీవుడ్) మూవీ కూడా రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పని అనే మలయాళం సినిమా జనవరి 16 నుండి స్ట్రీమింగ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: