రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ అయిన నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

frame రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ అయిన నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ క్రేజీ హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. ప్రస్తుతం తన కెరీర్లో 12వ సినిమాను గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. అయితే విజయ్ నటించిన లైగ‌ర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో విజయ్‌ కెరీర్ పడుతూ, లేస్తూ ముందుకు సాగుతోంది. కాగా విజయ్ దేవరకొండ ఓ నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలను చేజేతులా వదులుకున్నాడు.

ఆ సినిమాలు కూడా చేసి ఉంటే మనోడు  కెరీర్ మరోలా ఉండేది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ కథను వెంకీ.. విజయ్‌కు చెప్పారు. విజయ్ దీనిని రిజెక్ట్ చేయగా.. నితిన్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలాగే పూరీ జగన్నాథ్, రామ్ కెరీ ర్ లో మైలురాయిలా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కథ‌ ముందు విజయ్ కి వినిపించారు. . డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ కావడంతో.. కొన్ని సందేహాలు వ్యక్తం చేసినా. .. ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదు. .

ఇక ఆర్ఎక్స్ 100 కథ ను అజయ్ భూపతి ముందుగా విజయ్‌కు వినిపించారు. రోమాంటిక్ స‌న్నివేశాలు ఎక్కువగా ఉండటంతో తాను అప్పటికే చేసిన అర్జున్ రెడ్డి తరహాలో ఉంటుందని భావించి నో చెప్పారు. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో 2021 లో వచ్చిన ఉప్పెన సినిమా కథ కూడా ముందుగా విజయ్‌కు చెప్పారు. అర్జున్ రెడ్డి విడుదలైన తర్వాత విజయ్ రేంజ్‌ మారిపోవడంతో చివరకు వైష్ణవ్ తేజ్‌తో ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. ఈ నాలుగు సినిమాలు కూడా విజయ్ దేవరకొండ చేసి ఉంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ కెరీర్ మరోలా ఉండేది అనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: