ప్రభాస్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మిస్సయిన సినిమా తెలుసా..?
టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టుల తో దూసుకుపోతున్నారు. ప్రభాస్ నుంచి ఏ ప్రాజెక్టు వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాపై అంచనాలు మామూలు గా ఉండడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ పేరు ఇండియన్ సినిమా తెరపై మారు మోగుతుంది. త్వరలోనే రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే అతనొక్కడే .. నుంచి ఏజెంట్ వరకు స్టైలిష్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు.
కళ్యాణ్ రామ్ తో చేసిన అతనొక్కడే సినిమా ఘనవిజయం తర్వాత సురేందర్ రెడ్డికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో భాగంగా నే తన రెండో సినిమాకే ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. అతనొక్కడే సూపర్ హిట్ అయ్యాక చాలామంది హీరోలతో సురేందర్ రెడ్డికి సినిమా చేసే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ తో సినిమా చేసేందుకు అన్ని రెడీ చేసుకున్నాడట.
ఆ సమయంలో ఒక వ్యక్తి తారక్ తో సినిమా చేయాలని కోరడం .. ఆయన మాట కాదనలేక ప్రభాస్ సినిమా పక్కనపెట్టి తారక్ తో అశోక్ సినిమా చేయడం చక చక జరిగిపోయాయని .. సురేందర్ రెడ్డి తెలిపారు. పైగా అప్పటికే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్నారు. ఆ అవకాశం వదులుకోలేక ఆయన తో అశోక్ సినిమా చేశానని .. సురేందర్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ , సురేందర్ రెడ్డి కలిసి మరోసారి ఊసరవెల్లి సినిమా కోసం పనిచేశారు. అయితే ప్రభాస్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ మాత్రం పట్టాలు ఎక్కలేదు.