
రాజకీయాల్లో పవన్ సినిమాల్లో నాని .. ఇద్దరి మధ్య కామన్ పాయింట్ ఇదే..!
అలాంటి ధైర్యం చేయిబట్టి టాలీవుడ్ కు కొత్త తరహా సినిమా చూపించగలుగుతున్నాడు నాని . అంతేకాదు ప్రశాంత్ వర్మ లాంటి గొప్ప దర్శకుని టాలీవుడ్ కు అందించాడు .. హిట్ 1 , హిట్ 2 సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాలు అందుకున్నాయి .. శైలేష్ కొలను అనే దర్శకుడు కూడా ఈ సినిమాలతో టాలీవుడ్ లో తన సత్తా ఏంటో చూపించాడు .. ఇప్పుడు హిట్ 3 సినిమాతో వస్తున్నాడు .. ఈ సినిమా కూడా విడుదలకు ముందే మంచి లాభాలు బాట పట్టింది . అయితే ఇప్పుడు నాని నిర్మాతగా నిర్మించిన కోర్టు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. పరిమిత వరణలతో తీసిన సినిమా ఇది .. అయితే ఓ మంచి కంటెంట్ ని ఆ సినిమాతో ప్రేక్షకులకి అందించగలిగాడు .. అందరి నోట ఒకే మాట సినిమా బాగుంది అన్ని రివ్యూలు కూడా మంచిగా వచ్చాయి .. సినిమాపై నమ్మకంతో రెండు రోజులు ముందు ప్రీమియర్లు కూడా ఇచ్చాడు నాని ..
అంతేకాకుండా కోర్టు సినిమా నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు అంటూ సంచలన కామెంట్లు కూడా చేశాడు .. అయితే సినిమా ఫ్లాఫ్ అయితే మాత్రం నానిని సోషల్ మీడియాలో తెగ వేసుకునేవారు .. ఈ ప్రభావం తర్వాత హిట్ 3పై కూడా గట్టిగా ఉండేది . ఇవన్నీ తెలిసి కూడా నాన్ని రిస్క్ చేయగలిగాడు. దానికి తగిన ఫలితం వచ్చింది రిలీజ్ కు ముందే డబుల్ ప్రాఫిట్ తెచ్చుకుంది సినిమా .. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి కలెక్షన్లు వస్తాయో చూడాలి. ఇలా వరుసగా నాలుగు విజయాలతో నిర్మాతగా 100% స్ట్రైక్ రేట్ చూపించాడు నాని .. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు రాబోతున్న హిట్3 మరో ఎత్తు చిరంజీవి శ్రీకాంత్ ఓదల కాంబోలో వస్తున్న సినిమాను కూడా నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు .. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే నిర్మాతగా నాని మరో రేంజ్ కి వెళ్ళటం ఖాయం