అనిల్ రావిపూడి లో ఉన్న ఆ టాలెంట్ ఏ డైరెక్టర్ కి లేదు..అందుకే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడు..!

frame అనిల్ రావిపూడి లో ఉన్న ఆ టాలెంట్ ఏ డైరెక్టర్ కి లేదు..అందుకే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడు..!

Thota Jaya Madhuri
అనిల్ రావిపూడి ఏ సినిమాని తెరకెక్కించిన సరే అందులో కామెడీ ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు . ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లారిటీగా అర్థం అయిపోతుంది. కాగా ఎఫ్ 2, ఎఫ్3 లాంటి  కామెడీ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే సంక్రాంతి కానుకగా థియేటర్స్ తో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .


మరి ముఖ్యంగా వెంకటేష్ కి "కలిసుందాం రా" లాంటి హిట్ అందుకునేలా చేసింది . 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంకటేష్ నటనను  పొగిడేస్తున్నారు. కాగా  ఈ సినిమాకి హీరో ఎంత కీలకమో.. డైరెక్టర్ కూడా అంతే కీలకంగా మారారు అంటూ జనాలు మాట్లాడుతున్నారు . అనిల్ రావిపూడి డైరెక్షన్ సినిమాకి భారీ ప్లస్ అయింది . అనిల్ రావిపూడి ఒకే కామెడిని బేస్ చేసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్లతో జనాలను నవ్విస్తున్నారు అని ..ఆ విషయంలో పాన్  ఇండియా డైరెక్టర్స్ కూడా పనికిరారు  అని..అనిల్ రావిపూడి కామెడి టైమింగ్ ముందు పెద్ద పెద్ద బడా స్టార్స్ కూడా వేస్ట్ అంటూ అనిల్ రావిపూడి ని బాగా పొగిడేస్తున్నారు జనాలు .


అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతి వస్తున్నాం' సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. చూడాలి మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..? కాగా  'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ సంక్రాంతి రేసులో రియల్ విన్నర్ గా నిలిచింది . ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన 'గేమ్ చేంజఋ ..నందమూరి హీరో బాలయ్య నటించిన 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్ నెగటివ్ టాక్ అందుకుంది. డాకు మహారాజ్ ఓకే హిట్.  కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం క్లీన్ స్వీప్ చేసేసింది . ఈ సంక్రాంతికి రియల్ విన్నార్ గా పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద నిల్చుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: