సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

frame సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

Reddy P Rajasekhar
స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ సీనియర్ హీరోలలో ఎక్కువగా విజయాలను సొంతం చేసుకున్న హీరో అనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీ సబ్జెక్ట్ లతో వెంకటేశ్ అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రతి సందర్భంలో ఈ హీరోకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాయి. గతేడాది సైంధవ్ సినిమాతో వెంకటేశ్ కు చేదు ఫలితం ఎదురు కాగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేశ్ లక్ పరీక్షించుకున్నారు. ఇప్పటికే వెంకీ అనిల్ కాంబో హిట్ కాంబో అనిపించుకోగా ఈ కాంబోలో మరో సినిమా తెరకెక్కడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.
 
కథ :
 
వైడీ రాజు (వెంకటేశ్) తన భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్) తో కలిసి పిల్లాపాపలతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. గతంలో కాప్ గా పని చేసిన వైడీ రాజుకు మాజీ ప్రేయసి మీనూ (మీనాక్షి చౌదరి) ద్వారా ఒక కేసును పరిష్కరించాలనే సందేహం వస్తుంది. అదే సమయంలో భాగ్యంకు కొన్ని విషయాలు తెలియడంతో తాను కూడా వైడీ రాజు వెంట వస్తానని పట్టుబడుతుంది.
 
ఒకవైపు ప్రేయసి, మరోవైపు మాజీ ప్రేయసి మధ్య వైడీ రాజు ఏ విధంగా నలిగిపోయాడు? తనకు ఎదురైన కిడ్నాప్ కేసు సమస్యను ఏ విధంగా పరిష్కరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తనకు సూట్ అయ్యే పాత్ర దక్కిన ప్రతి సందర్భంలో అద్భుతమైన నటనతో అదరగొడతారు. ఫ్యామిలీ సబ్జెక్ట్స్ విక్టరీ వెంకటేశ్ కు భారీ విజయాలను అందించగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ కనిపించిన ప్రతి సీన్ నవ్వుల పువ్వులు పూయిస్తుంది. పటాస్ సినిమా నుంచి భగవంత్ కేసరి వరకు ప్రతి సినిమాలో తన కామెడీ రైటింగ్ తో మెప్పించిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కూడా మ్యాజిక్ చేశారు. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి బెస్ట్ మూవీ మాత్రం కాదని చెప్పవచ్చు.
 
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కథ, కథనం విషయంలో కొన్ని లోపాలు ఉన్నా పండగకు విందు భోజనం లాంటి సినిమా చూడాలని భావించే వాళ్లకు సంక్రాంతికి వస్తున్నాం పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో అదరగొట్టారు. ఒకరిని మించి మరొకరు నటించి ప్రేక్షకులను మెప్పించారు.
 
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు పెరగడానికి, సినిమా అంచనాలను అందుకోవడానికి కారణం మ్యూజిక్ అని చెప్పవచ్చు. గోదారి గట్టు, మీనూ పాటలకు టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. తమ్మిరాజు ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి తన వంతు న్యాయం చేశారు. ఎస్వీసీ బ్యానర్ నిర్మాణ విలువలు ఓకే అనేలా ఉన్నాయి.
 
 
ప్లస్ పాయింట్లు :
 
అనిల్ మార్క్ అదిరిపోయే కామెడీ సన్నివేశాలు
 
వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటన
 
భీమ్స్ సంగీతం
 
 
బలహీనతలు :
 
లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
 
కథనం ఊహించేలా సాగడం
 
అనిల్ గత సినిమాల స్థాయిలో లేకపోవడం
 
రేటింగ్ : 2.75/5.0

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: