ఈ సంక్రాంతికి హ‌నుమాన్ రికార్డును కొట్టే మొన‌గాడెవ్వ‌డు...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మన టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి పండుగ సినిమాల పరంగా పోరు ఎప్పుడూ మంచి రసవత్తరంగానే ఉంటుంది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేశాయో చూశాం. కంటెంట్ ఉంటే హ‌నుమాన్ లాంటి చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతాయ‌ని ఫ్రూవ్ చేశాయి. ఇక ఈ సారి సంక్రాంతికి కూడా పలు సాలిడ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అన్నింటి కంటే ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ .. ఆ త‌ర్వాత నంద‌మూరి నట సింహం బాలయ్య నటించిన భారీ సినిమా డాకు మహారాజ్ .. ఇక చివ‌ర‌గా సీనియ‌ర్ హీరో వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో ఆల్ టైం రికార్డు వసూళ్లు వ‌చ్చిన సినిమా గా గ‌త యేడాది వ‌చ్చిన చిన్న సినిమా హ‌నుమాన్ రికార్డుల్లోకి ఎక్కింది. పేరుకు ఇది చిన్న సినిమా అయినా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. యంగ్ హీరో తేజ సజ్జ అలాగే ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో సంచ‌ల‌న హిస్టరీ క్రియేట్ చేసింది. దీనితో హనుమాన్ సెట్ చేసిన రికార్డు ఈ సంక్రాంతి సినిమా దెబ్బ‌కు బ్రేక్ అవుతుందో లేదో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు సంక్రాంతి కి వ‌చ్చిన సినిమా ల‌లో హ‌నుమాన్ ఒక్క‌టి మాత్ర‌మే రు. 300 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇక షేర్ ప‌రంగా చూసుకున్నా సంక్రాంతి సినిమా ల‌లో ఈ సినిమా దే పై చేయి .. మ‌రి ఈ సారి వ‌స్తోన్న మూడు సినిమా ల‌లో గేమ్ ఛేంజ‌ర్ ఒక్క దానికే ఈ రికార్డును కొట్టే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: