బాలయ్య- రామ్ చరణ్ సినిమాలకు హైకోర్టు ఘలక్..!

Divya
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న చిత్రాలలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ , బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఇందులో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి సినిమాలకు టికెట్ల రేటు పెంపు విషయం పైన హైకోర్టులో కేసు వేయడం జరిగిన సంగతి తెలిసిందే.. గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజు ఒంటిగంట వరకు బెనిఫిట్ షో టికెట్లు రూ.600 రూపాయలు నిర్ధారించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అలాగే బాలయ్య చిత్రానికి రూ.500 రూపాయలు పెంచుకునేలా సదుపాయాన్ని కల్పించింది.

ఇక మల్టీప్లెక్స్ రూ .175 రూపాయలు సింగిల్ స్క్రీన్ థియేటర్ కైతే రూ.135 రూపాయలను పెంచుకోవడానికి జనవరి 23 వరకు వీలు కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ టికెట్స్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో దీంతో ఈ విషయాన్ని సవాల్ చేస్తే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. ఇలా బెనిఫిట్స్ అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కచ్చితంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ పిటిషనర్ అందులో ప్రస్తావించడం జరిగిందట.

అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెంచారంటూ పిటిషనర్ తెలియజేశారు. ఈ పిటిషన్ పైన ఈరోజు విచారణ చేపట్టగా.. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్లు ధరల పెంపు విచారణ కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను విచారించిన తరువాత వాటిని 10 రోజులకే పరిమితం చేసింది హైకోర్టు. దీంతో బాలయ్య రామ్ చరణ్ సినిమాలు కలెక్షన్స్ పైన కచ్చితంగా గండి పడుతుందని అభిమానుల సైతం వాపోతున్నారు. మరి ఏ మేరకు కలెక్షన్స్ లో ఎలాంటి రికార్డ్స్ రాబడతాయో చూడాలి మరి. సంక్రాంతి విన్నర్ ఎవరో కూడా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: