ప్రేమపై నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్..!
జయం రవి, నిత్యామీనన్ జంటగా డైరెక్టర్ కృతిక ఉదయినిది డైరెక్షన్లో వస్తున్న చిత్రం కదలిక్క నేరిమిల్లై సినిమా మ్యూజిక్ ని ఈ రోజున చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం గమనార్హం. ఈ వేడుకలో నిత్య మీనన్ మాట్లాడుతూ తన జీవితంలో ప్రేమించడానికి ఎక్కడ సమయం లేదని కూడా వెల్లడించింది. అయితే గత కొద్దిరోజులుగా నిత్యమీనన్ ఒక హీరోలతో ప్రేమాయణం నడుపుతోందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించడంతో ఈ రూమర్స్ కి ఇలా చెక్ పెట్టిందని చెప్పవచ్చు.
నిత్య మీన కుటుంబ విషయానికి వస్తే ఈమె కుటుంబం బెంగళూరులో స్థిరపడింది ఈమె కుటుంబం కూడా మలయాళీ కుటుంబం.. నిత్యమీనన్ ఎనిమిది సంవత్సరాల వయసులోనే హనుమాన్ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించిందట.. ఒక మ్యాగజైన్ కవర్ మీద హీరో మోహన్ లాల్ ఈమె ఫోటోలు చూసి మలయాళ సినీ పరిశ్రమకు పరిచయం చేశారట ఆ సినిమాని ఆకాశ గోపురం .. ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీకి పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో నిత్యమీనన్ అధిక బరువు పెరగడం వల్ల చాలా మంది ఈమెను ట్రోల్ చేయడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా తన సెలెక్టివ్ పాత్రలతో ముందుకు వెళ్తోంది.