"ఆ విషయం టోటల్ అబద్ధమే".. తేల్చి చెప్పేసిన మెగా కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి..!

Thota Jaya Madhuri
లావణ్య త్రిపాఠి..హీరోయిన్గా ఎంత ఫామ్, పబ్లిసిటీ, పాపులారాటీ సంపాదించుకుంది అనే విషయం పక్కనపెడితే వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడుపుతుంది అని ..మెగా ఇంటికి కోడలు కాబోతుంది అని సగం వరకు తన పాపులారిటీ మొత్తం సంపాదించుకునేసింది . ఆ తర్వాత వరుణ్ తేజ్ తో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫోటోలు బయటకు రాగానే ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. బ్యాక్ గ్రౌడ్ పెద్దగా లేని లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా చేసుకున్నారా..? నాగబాబు అంటూ చాలామంది షాక్ అయిపోయారు .


అప్పటినుంచి నాగబాబుపై మరింత గౌరవం పెరిగింది. ప్రేమకు విలువ ఇస్తారని.. ప్రేమ అనే విషయాన్ని అర్థం చేసుకుంటారని నాగబాబును ఓ రేంజ్ లో పొగిడేసారు జనాలు . కాగా ఇటలీలో అంగరంగ వైభవంగా ఘనంగా లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ల పెళ్లి జరిగింది. వీళ్ళ పెళ్ళై వన్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈలోపే లావణ్య త్రిపాఠి కొన్ని ఫొటోస్ లో బొద్దుగా ఉండడం చూసి ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . అయితే తాజాగా ఆమె పీచ్ కలర్ శారీతో ఒక ఎక్సలెంట్ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోస్ నెట్టింట జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి .


అయితే తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అంటూ తేల్చి చెప్పేసింది లావణ్య త్రిపాఠి . దీంతో మెగా ఫాన్స్ కూసింత డిసప్పాయింట్ అవుతున్న త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వినకపోమా..? అన్న ఆశలతో లావణ్య త్రిపాఠి పోస్ట్ ని లైక్ చేస్తున్నారు . కాగా మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్న సరే లావణ్య త్రిపాఠి మాత్రం సైన్ చేయడం లేదు . దానికి రీజన్ ఏంటి అనే విషయం కూడా అర్థం కావడం లేదు . ఒకాయనొక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాత్రం లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటిస్తుంది అని.. కాకపోతే మంచి హోమ్లి స్క్రిప్ట్.. ఆమె మనసుకు నచ్చే పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పుకొచ్చారు . చూడాలి మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో..??


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: