నందమూరి బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను , టీజర్ , ట్రైలర్ ను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను ఈ మూవీ యూనిట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఈ మూవీ టికెట్ రేట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగ వంశీ కి తెలంగాణలో మీ సినిమాకు టికెట్ రేట్లు పెరగనున్నాయా అనే ప్రశ్న ఎదురయింది. దానికి నాగ వంశీ సమాధానం ఇస్తూ ... మేము తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్ ల పెంపు కోసం ప్రభుత్వాన్ని కోరే ఆలోచనలో లేము. మాకు ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న టికెట్ రెట్లు సరిపోతాయి.
ప్రత్యేకంగా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ టికెట్ రేట్లు కావాలి అని అడిగే ఉద్దేశం లేదు. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచారు ... అది సరిపోతుంది అని ఆయన చెప్పాడు. దానితో తెలంగాణ రాష్ట్రంలో డాకు మహారాజ్ సినిమా సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.