హమ్మయ్య.. ఈ సంక్రాంతికి ఆ సినిమాల గోల తప్పిందిగా..!!

murali krishna
సంక్రాంతి అంటేనే తెలుగువారి పెద్దపండుగ. కుటుంబమంతా కలిసి మూడు రోజుల పాటు చేసుకునే ముచ్చటైన పండుగ. ఆట పాటలు, ముగ్గులు, పందెం కోళ్ల పోటీలు, థియేటర్లో అభిమాన నటుల సినిమాలు.ఇలా చాలా రకాలైన సరదాలతో జరుపుకునే పండుగ ఇది. అయితే, ఈ పండుగ పూట కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు అయితే వేరే లెక్క.తెలుగు ప్రేక్షకులు పెద్ద సినిమాల కోసం, చిన్న సినిమాల ఫ్యామిలీ డ్రామా కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుందంటే చాలు అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్, ఫ్రెండ్స్ తో మీటింగ్స్ ఇలా అపుడు ఉండే ఆ సందడే వేరు. ఇదిలావుండగా ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే ఐదేళ్ల తర్వాత ఆ ముగ్గురు హీరోలు మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు.సరిగ్గా ఐదేళ్ల క్రితం బాలకృష్ణ, రామ్‌చరణ్‌, వెంకటేశ్‌లు నటించిన సినిమాలు సంక్రాంతికి వచ్చి సందడి చేశాయి. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ 'NTR కథానాయకుడు'తో  బాలకృష్ణ సందడి చేశారు.ఇక మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ వినయ విధేయరామ అంటూ పలకరించారు. ఇక 2019 సంక్రాంతికి నవ్వుల విందును పంచారు వెంకటేశ్‌. ఆయన కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌' ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టారు. ఐదేళ్లు గడిచిపోయాయి. 

ఇప్పుడు 2025లోనూ ఆ ముగ్గురు హీరోలే సంక్రాంతి బరిలో నిలిచారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.ఇక బాలకృష్ణలోని సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు బాబీ. ఆయన దర్శకత్వంలో వస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం 'డాకు మహారాజ్‌'. ప్రజ్ఞా జైశ్వాల్‌, శ్రద్ధాశ్రీనాథ్‌ కథానాయికలు. నాగవంశీ నిర్మాత. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.ఇక ఈ సంక్రాంతికి వినోదాల విందును పంచడానికి సిద్ధమయ్యారు. వెంకటేశ్‌ , అనిల్‌ రావిపూడి. వీరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఇప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటుడు అంటే వెంకటేశ్‌. ఇక ఈ సినిమా జనవరి 14ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలావుండగా టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. మనకే థియేటర్లు సరిపోవయ్యా అంటే హక్కులు కొనేశామనే కారణంతో ఏదోలా రిలీజ్ చేసే నిర్మాతలు కనిపిస్తూనే ఉంటారు.ఈసారి అలాంటి గోల లేకుండా దిగుతున్నారు కనక రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఈ అవకాశాన్ని ఫుల్లుగా వాడుకోవాలి. టాక్ పాజిటివ్ వస్తే చాలు కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడతాయి. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ప్రీ రిలీజ్ బజ్ ఇంచుమిందు అన్నింటికి ఒకేలా కనిపిస్తున్న తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: