గేమ్ ఛేంజర్ టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..రామ్ చరణ్ బీట్ చేసేనా..?

Divya
మెగాస్టార్ రామ్ చరణ్ rrr తర్వాత సోలోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా పదవ తేదీన ప్లీజ్ కాబోతున్నది. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ,నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్లోనే నిర్మించారు. హీరోయిన్ గా కియారా అద్వానీ , అంజలి తదితర నటీనటులు నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇటీవలే భారీగానే చేయడం జరిగింది. మరి ఎన్నో భారీ అంచనాల మధ్య రాబోతున్న గేమ్ ఛేంజర్ టార్గెట్ ఎన్ని కోట్లు రామ్ చరణ్ ఫినిష్ చేయగలరా అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

దిల్ రాజు గేమ్ ఛేంజర్ చిత్ర రెడ్డి సుమారుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించినట్లు టాక్ వినిపిస్తోంది.. అయితే ఇప్పటికే 250 కోట్ల రూపాయల థియేటర్లు బిజినెస్ జరిగిందని.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి అవ్వాలి అంటే సుమారుగా 400 నుంచి 450 కోట్ల రూపాయల లోపు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉన్నదట. నార్త్ లో బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు గ్రాస్ చేయాల్సి ఉన్నది. ఒకవేళ మౌత్ టాక్ బాగుంటే కచ్చితంగా అక్కడ వసూలు చేస్తుందని చెప్పవచ్చు.

కానీ అక్కడ హిందీ ప్రేక్షకులకు ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదని సమాచారం. పుష్ప 2 సినిమా హిందీలో భారీగానే విజృంభించికలెక్షన్స్ పరంగా టాప్ వన్ లో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక ,కేరళ వంటి ప్రాంతాలలో బాగా ఆకట్టుకోవాల్సి ఉన్నది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో 130 కోట్లకు పైగా రాబట్టాలని ట్రెండ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఏ మేరకు గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి సంక్రాంతికి చాలా సినిమాలు పోయేటికి పడి విడుదలవుతున్నాయి.. వీటన్నిటినీ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి దిల్ రాజుకు ఏ సినిమా అత్యధిక లాభాలను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: