సంక్రాంతి వచ్చిందంటే చాలు నిర్మాత దిల్ రాజు తనకి సంబంధించిన ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ ఉంటారు. అలా 2025 సంక్రాంతి మాత్రం పూర్తిగా దిల్ రాజుదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దిల్ రాజు నిర్మాతగా చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ తో పాటు వెంకటేష్ హీరోగా చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలకు నిర్మాతగా చేస్తున్నారు.అలాగే బాలకృష్ణ నటిస్తున్న డాకూ మహారాజ్ సినిమాని కూడా నైజాంలో దిల్ రాజే విడుదల చేస్తున్నారు.దీంతో ఈ సంక్రాంతి మొత్తం దిల్ రాజుదే అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించారు.
అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు విన్న చాలా మంది తెలంగాణ సినీ ప్రేక్షకులు దిల్ రాజుని ఏకిపారేస్తున్నారు. మరి ఇంతకీ దిల్ రాజు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే.. మా తెలంగాణ ఆడియన్స్ ఎక్కువగా సినిమాలకు కాకుండా తెల్ల కల్లు,మటన్ కే వైబ్ ఇస్తారు. కానీ ఆంధ్ర ఆడియన్స్ మాత్రం సినిమాకు వైబ్ ఇస్తారు.. అంటూ వెంకటేష్ తో చెప్పారు.మా తెలంగాణ వాళ్ళు తెల్లారితే నీర తాగుతూ ఎంజాయ్ చేస్తారు. నీరతో వాళ్లకి వైబ్ వస్తుంది.. అంటూ దిల్ రాజు తెలంగాణ సినీ ప్రేక్షకులను అవమానించినట్టు మాట్లాడారు.
దీంతో చాలామంది ఈ విషయం విన్న తెలంగాణ సినీ ప్రేక్షకులు సినిమాలను తెలంగాణ వాళ్లు ఆదరించకుండానే ఇంత పెద్ద హిట్లు కొడుతున్నారా.. మాట్లాడేటప్పుడు కాస్తయినా ఆలోచించడం అక్కర్లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. మీ దృష్టిలో సినిమాలు చూడడంలో ఆంధ్ర బెస్ట్ తెలంగాణ వేస్టా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దిల్ రాజు వైబ్ గురించి మాట్లాడినప్పటికీ చాలామంది మాత్రం దిల్ రాజు మాటలని వివాదాస్పం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ఆడియన్స్ దిల్ రాజు పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.దిల్ రాజు తెలంగాణ వాడైనప్పటికీ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారని ఫైర్ అవుతున్నారు