ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ పేమెంట్ తీసుకునే ఏకైక స్టార్ హీరో ఇతడే..!

Thota Jaya Madhuri

సినిమా ఇండస్ట్రీలో సినిమా చేస్తున్నాము అంటే కచ్చితంగా కాస్తో.. కూస్తో డబ్బులు ఎవరికో ఒకరికి ముట్టుతాయి. హీరోలకి - హీరోయిన్లకి - డైరెక్టర్లకి ఎక్కువ రెమ్యూనరేషన్స్ వెళ్తాయి. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కి చాలా చాలా తక్కువ పేమెంట్స్ వెళ్తూ ఉంటాయి. అయినా సరే క్యారెక్టర్ ఆర్టిస్టులకు.. క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు కొంచెం రెమ్యూనరేషన్ వాళ్లకు సంబంధించిన కాల్ షీట్స్ అన్ని అయిపోయాక పూర్తిగా మిగిలిన రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్స్  ఇస్తూ ఉంటారు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులకే కాదు హీరోయిన్స్ కి హీరోస్ కి కూడా ఇలాగే చేస్తూ ఉంటారు.
ఆఖరికి డైరెక్టర్ విషయంలో కూడా అంతే . ఒక సినిమాకి కోటి రూపాయలు పారితోషకం తీసుకుంటున్నారు.. అంటే మొదటగా 50 లక్షలు సినిమా కంప్లీట్ అయిన తర్వాత 50 లక్షలు ఆ పర్సన్ కి ఇస్తూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో సినిమాకి కమిట్ అయినప్పుడే పూర్తి రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరో మాత్రం సల్మాన్ ఖాన్ అంటూ ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూ వస్తూనాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం అందరికి బాగా తెలిసిందే. సల్మాన్ ఖాన్ తన సినిమా కమిట్ అయిన మూమెంట్లోనే పూర్తి రెమ్యూనరేషన్ ని అందుకునేస్తాడట .
మొదట అడ్వాన్స్ ఆ తర్వాత క్లియరింగ్ బ్యాలన్స్ అనేటివి లేకుండా ప్రొడ్యూసర్స్ మొత్తం డబ్బులు ఒకేసారి ఆయనకు అందజేస్తారట . సల్మాన్ ఖాన్ ముందు నుంచి అదే అలవాటుగా ముందుకు వెళ్లిపోతున్నాడట. అయితే సల్మాన్ ఖాన్ లా ఏ బాలీవుడ్ హీరో కూడా రెమ్యూనరేషన్ మొత్తం ముందే తీసుకోడు. ఆ మాటకొస్తే తెలుగు హీరోలు కూడా రెమ్యూనరేషన్ మొత్తం సినిమాకి ముందే తీసుకోరు . ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. సల్మాన్ ఖాన్ అందరిలాంటి హీరో కాదు. అది వేరే బ్రాండ్ . అలాంటి బ్రాండ్స్ కొన్నే ఉంటాయి . సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: