వెంకీ కాదు.. "సంక్రాంతికి వస్తున్నాం" మూవీకి ఫస్ట్ అనుకున్న హీరో ఆయనే.?

Pandrala Sravanthi
 సంక్రాంతి వస్తున్నాం.. సినిమా టైటిల్ తోనే భారీ హైప్ పెంచేసిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు అన్నీ చూస్తే కనుక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా చేస్తున్నారు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.మూడో సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబో గా అనిల్ రావిపూడి వెంకీ లకు పేరు వస్తుంది. అయితే ఈ సినిమా నుండి విడుదలైన గోదారి గట్టుమీద రామచిలకవే అనే పాట సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఈ పాట చూడడానికైనా సినిమాకి వెళ్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మొదట అనుకున్న హీరో వెంకటేష్ కాదట.వేరే హీరోని అనుకున్నారట.ఆ హీరో రిజెక్ట్ చేయడం వల్ల ఈ సినిమా వెంకటేష్ కి వచ్చింది అని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా చెప్పారు. మరి ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి..ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బయటపెట్టారు.. సంక్రాంతికి వస్తున్నాం స్టోరీ ని ముందుగా చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాం.

 అయితే ఈ స్టోరీ చిరంజీవికి నచ్చినప్పటికీ ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ని రిజెక్ట్ చేశారు.దాంతో ఈ స్టోరీని వెంకటేష్ తో చేస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో పాటు క్రైమ్ కథాంశంతో రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.కచ్చితంగా సంక్రాంతి బరిలో ఈ సినిమా గేమ్ చేంజర్,డాకు మహారాజ్ కి గట్టి పోటీని ఇస్తుంది అని వెంకీ అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏమేర ప్రేక్షకులను అలరిస్తుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: