కీర్తి సురేష్ కంటే తన భర్త ఎంత పెద్ద వాడో తెలుసా..?
ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ జాన్ అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో వరుణ్ ధావన్ హీరో గా నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనికి కారణం బోలెడు అనే చెప్పాలి. ముఖ్యంగా పుష్ప2 సినిమా అక్కడ ఇంకా థియేటర్లలో రన్ అవ్వడం వల్ల ఈ సినిమాకు థియేటర్ కు లభించడం లేదు. ఒకవేళ లభించినా కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఆడియన్స్ రాకపోవడం వల్ల షోలు తగ్గించి, సినిమాను 100 సీట్లు ఉన్న థియేటర్కు మార్చారు.
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఇటీవల ఆంటోనీ తట్టిల్ అనే దుబాయ్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఇతడితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది అని, గత రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తమలో కలిగిందని, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తనకు, తన భర్తకు మధ్య వయసు తేడా గురించి కూడా ఆమె వెల్లడించింది. తనకంటే ఆంటోని తట్టిల్ దాదాపు 7 సంవత్సరాలు వయసులో పెద్దవాడని చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.