తొలిప్రేమ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో ఎంత ఆసక్తి నెలకొంటుందో అందరికీ తెలిసిందే. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్నా కూడా పవన్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గదు. పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో తెరకెకుతున్న ఓజీ సినిమాతో పాటు ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటించమన్నారు. హరిహర వీరమల్లు సినిమాకు శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం. రత్నం తనయుడు ఏఎం . జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.
ఈ మూడు సినిమాలు తో 2025 - 2026 లో పవన్ ప్రేక్షకుల ముందు రానున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో క్లాసిక్ ఎవర్గ్రీన్ రొమాంటిక్ మూవీ తొలిప్రేమ. ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా కు ఆరోజుల్లోనే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్తాయిలో అవార్డు వచ్చింది. ఈ సినిమా కోసం తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో పవన్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమా కోసం పవన్ 15 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇందులో ఆయన లక్ష రూపాయలు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నట్టు వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ముందు నుంచి పుస్తక ప్రియుడు అన్న విషయం తెలిసిందే. పవన్ ఖాళీగా ఉంటే చాలు పుస్తక పఠణంలో బిజీ బిజీ అయిపోతారు.