టాలీవుడ్ సెన్షేష‌న్‌: మ‌హేష్‌, బాల‌య్య‌ను ఓడించి విజేత‌గా నిలిచిన త‌రుణ్‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అటువైపు ఇద్దరు పెద్ద హీరోలు ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు .. మరొకరు నట సింహం బాలకృష్ణ. ఈ ఇద్దరు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. అందులోను 22 ఏళ్ల క్రితం ఖచ్చితంగా ఈ ఇద్దరు హీరోల మధ్యలో ఓ చిన్న హీరో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా నలిగిపోతుంది .. పెద్ద రిస్క్ అని అందరూ అనుకుంటారు. అయితే అందరి ఇంచనాలు తలకిందులు చేస్తూ ఆ ఇద్దరు హీరోలను డామినేట్ చేస్తూ తన సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు ఆ కుర్ర హీరో. ఆ కుర్ర హీరో ఎవరో కాదు తరుణ్ .. 22 సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన సీమ సింహం - మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు పోటీగా త‌రుణ్ - ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు లేక నేను లేను సినిమా కూడా రిలీజ్ అయింది. వాస్తవానికి ముందుగా ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు.

బాలయ్య సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో తొలిసారి కౌబాయ్ సినిమా చేస్తూ ఉండడంతో టక్కరి దొంగ కూడా సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. టక్కరి దొంగ సినిమా మహేష్ ఎంత కష్టపడి చేసిన ఈ తరం జనరేషన్ కు ఎక్కలేదు. భారీ బడ్జెట్ కావడంతో నష్టం వచ్చింది సీమ సింహం జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ఇక నువ్వు లేక నేను లేను సినిమా ఇటు యువతరం ప్రేమికులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. కొన్ని కేంద్రాలలో 175 - 200 రోజులు కూడా పూర్తి చేసుకుంది. అలా 2002 సంక్రాంతికి తరుణ్ విజేతగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: