నిఖిల్, కావ్యల మధ్య ఏం జరిగిందంటే..?
నిఖిల్ బయట ఎలా ఉన్నడో.. బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. నిఖిల్ ఎప్పుడు ఫ్రెండ్ లిగానే మాట్లాడుతాడని, ఉంటాడని తెలిపాడు. ఇక కావ్య శ్రీ, నిఖిల్ గురించి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనకి తెలీదు. వారిద్దరి మధ్య గొడవ మాత్రం జరిగింది. అయితే ఆ గొడవ వల్ల నిఖిల్, కావ్య ఇప్పుడు కొంత కాలం దూరంగా ఉండచ్చు.. మళ్లీ తర్వాత కాలవచ్చు కూడా కానీ మనం వాళ్ల మధ్యలోకి వెళ్లడం మంచిది కాదని అన్నాడు. చూద్దాం ఏం జరిగిందో ఎవరికి తెలీదు కదా అంటూ అర్జున్ అంబటి చెప్పాడు.
ఇక ఇటీవల మా టీవీలో వచ్చే ఓ షోలో నిఖిల్, కావ్య ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆ షోకి శ్రీముఖి కి యాంకర్ అవ్వడంతో పలు విధాలుగా కావ్యని, నిఖిల్ ని కలపడానికి ప్రయతించినప్పటికి కావ్య నిఖిల్ తో వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతే కాకుండా తాను నిఖిల్ గురించి మాట్లాడిన ప్రతిసారి చాలా కోపంగా చూసింది. దీంతో ఈ షోలో అందమైన అమ్మాయి ఎవరు అని శ్రీముఖి నిఖిల్ ని అడిగింది. అయితే ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ జరిగింది.