2024 పెద్ద ట్రోలింగ్ స్టఫ్‌గా మారిన విజయ్ దేవరకొండ.. ?
టాలీవుడ్ లో ఈ ఏడాది మీడియం రేంజ్ హీరోలు నుంచి ఎక్కువ డిజాస్టర్లు వచ్చాయి. రవితేజ - గోపిచంద్ - వరుణ్ తేజ్ - విజయ్ దేవరకొండ - విశ్వక్సేన్ వీరితో పాటు అల్లరి నరేష్ - సుధీర్ బాబు - శ్రీ విష్ణు - రామ్ నారా రోహిత్ - శర్వానంద్ ఇలా ప్రతి ఒక్కరు డిజాస్టర్ సినిమాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ షాకులలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఒకటి. అసలే గత రెండేళ్లు వరుసగా హిట్ లేదు. 2022లో లైగర్ లాంటి అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇచ్చారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ ఒకటే హడావిడి చేశారు. తీరా సినిమా ఘోరాతి ఘోరమైన డిజాస్టర్ అయింది. విజయ్ పరువు మొత్తం తీసేసినట్లయ్యింది.
ఆ తర్వాత రూటు మార్చి ఖుషి సినిమా తీశారు. సమంత హీరోయిన్. ఆ సినిమా కూడా పేరుకు యావరేజ్ కాని.. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఏ మాత్రం అతడి కెరీర్ కు యూజ్ లేని సినిమా.. అతడి మార్కెట్‌కు యూజ్ లేని సినిమా అయ్యింది. ఏదో జస్ట్ యావరేజ్.. ప్లాప్ కాదులే అని చెప్పేందుకు మాత్రమే ఉపయోగ పడింది. ఇక ఈ యేడాది బిగ్గెస్ట్ షాక్ ది ఫ్యామిలీ స్టార్. అసలు ఓ సీరియల్ టైప్ కథతో ఈ సినిమా వచ్చింది. దిల్ రాజు నిర్మాత .. గతంలో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో అందరూ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అవ్వడతో పాటు ఈ యేడాది ట్రోలింగ్ స్టఫ్ కు బాగా యూజ్ అయ్యింది. చివరకు ఈ సినిమా లో విజయ్ దేవర కొండ నటన కూడా ట్రోలింగ్ కు గురైందంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.