వార్ 2 నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేసే అప్డేట్.. ఎన్టీఆర్ డ్యూయల్ షేడ్స్...?
తాజాగా అందుతున్న లీక్ ప్రకారం వార్2లో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపిస్తారట .. ఒకటి దేశభక్తితో శత్రువు ఎంతటి వాడైనా సరే ఊచకోత కోసే ఇండియన్ ఆఫీసర్గా .. మరొకటి జై లవకుశ తరహాలో పైకి చెడు కనిపించిన లోపల ఎమోషనల్ గా ఉండే విలన్ టైపు క్యారెక్టర్ అన్నమాట .. అయితే ఇది డ్యూయల్ రోల్ లేక కథకు అనుగుణంగా ఇలా మారుతూ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది .. ఇక స్క్రీన్ ప్రజెంస్ పరంగా హృతిక్ , తారక్ నువ్వనేనా అనే రేంజ్ లో పోటీపడ్డారని టాక్. వచ్చే మార్చ్ నుంచి ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు చేయని బిగ్గెస్ట్ ఈవెంట్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఇతర దేశాల్లో కూడా ప్రమోట్ చేస్తారట.
ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావటంతో తెలుగు హక్కుల కోసం అప్పుడే భారీగా పోటీ ఏర్పడింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కి నిర్మాత నాగవంశీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో దీనికి మల్టీస్టారర్ క్రేజ్ వస్తుందని బయ్యర్ల అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హృతిక్ కి జంట గా కీయరా అద్వానీ కాగా ఎన్టీఆర్ కి హీరోయిన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. స్పై యూనివర్స్ లో వార్2ని భాగం చేస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళిద్దరితో పాటు షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , , టైగర్ శ్రోఫ్, అలియా భట్ ఇలా అందరూ ఎవెంజర్స్ తరహాలో ఒక గ్రాండ్ మల్టీ స్టార్ చేసిన ఆశ్చర్యం లేదు.