తల్లిదండ్రుల కంటే నాకు వాళ్లే ఎక్కువ: సోనియా ఆకుల

MADDIBOINA AJAY KUMAR
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లి వచ్చాక యష్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఇటీవల వీరి వివాహం కూడా జరిగింది. అయితే సోనియా, యష్ వల్ల నాన్న గురించి చెప్పుకొచ్చింది. 'మా మామయ్య ప్రపంచం అంతా కలిసి వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పిన కూడా తాను మాత్రం నేను కరెక్ట్ అని నమ్ముతారు. వల్ల కూతురిలా నన్ను చూసుకుంటారు. శ్వేతమ్మ యష్ చెల్లి. తాను రీసెంట్ గానే చనిపోయింది, తన ప్లేస్ లో నన్ను ఊహించుకొని మా మామయ్య నన్ను చూసుకుంటారు. పేరెంట్స్ కన్నా నాకు మా మామయ్యనే ఎక్కువ.. అంతేకాదు నాకు అందరికన్నా ఎక్కువ బలం ఇచ్చింది కూడా మా మామయ్యనే. యష్ కన్నా కూడా మా మామయ్యనే నన్ను ఎక్కువగా చూసుకుంటారు' అని సోనియా తెలిపింది.

ఈమె బిగ్ బాస్ హౌస్ లో నాలుగైదు వారాల్లో ఉన్నప్పటికీ చాలా మందికి తెలిసిపోయింది. సోనియా ఆకుల అంటే ఇప్పుడు తెలియని వారంటూ ఉండరు.. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు.  సోనియా ఆకుల ఆర్జీవి సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈమె ఒక స్వచ్చంధ సేవా సంస్థ కూడా నడిపిస్తుంది. 

అయితే సోనియా బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ లో నిఖిల్, పృధ్విలతో బాగా క్లోజ్ అయ్యింది. ఆమె ఏం చెబితే అది చేసేలా వాళ్లిద్దరిని మార్చేసింది. వాళ్లిద్దరితో క్లోజ్ గా ఉంటూ లవ్ స్టోరీ నడిపిస్తుంది అనే సారికి.. సడెన్ గా పెద్దోడు చిన్నోడు అంటూ మాట మార్చేసింది. అంతేకాదు తర్వాత తాను యష్ అనే అతనితో లవ్ లో విషయం కూడా చెప్పింది. బయటకు వెళ్లాక పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది. కానీ సోనియా నిఖిల్, పృధ్విని తనకి నచ్చినట్లు ఆడుస్తుందని టాక్ వచ్చింది. ఆ నెగిటివిటీ వల్లే సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి అడుగు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: