చరణ్ బాడీలో ఆ పార్ట్ చూసి అమ్మాయిలు పడిపోతారు..గేమ్ చేంజర్ ఎడిటర్ షాకింగ్ కామెంట్స్
ఈ సినిమాలోని ఇప్పటికే సాంగ్స్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ధియేటర్ లో విడుదల కానుంది. ఈ సినిమాపై మెగా ఫాన్స్ కు రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో మరో గేమ్ చేంజర్ సినిమా అవుతుందని అనుకుంటున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఎడిటర్ రూబెన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
మెగా హీరోరామ్ చరణ్ గురించి రూబెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ టాపిక్ మీద రూబెన్ మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ పర్ఫామెన్స్ చాలా బాగుందని తెలిపాడు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించాడని చెప్పాడు. అన్ని కారెక్టర్లను రామ్ చరణ్ అద్భుతంగా పోషించాడని రూబెన్ చెప్పుకొచ్చాడు. ఓ ఎడిటర్‌గా తాను రామ్ చరణ్ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ గురించి వర్ణించాడు. రామ్ చరణ్ చూడటానికి గ్రీక్ గాడ్‌లా ఉంటారని.. వారికి ఉండే ఫీచర్స్ ఉన్నాయని అన్నాడు. అలాగే చరణ్ జాలైన్ (దవడ) బాగుంటుందని.. అది నాకు చాలా ఇష్టమని రూబెన్ తెలిపారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.