ప్రభాస్ - రామ్ చరణ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!
ఇదే క్రమంలో ప్రభాస్ , రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోలుగా దూసుకుపోతున్నారు .. ఇక అందుకు కారణం రాజమౌళి , రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసిన తర్వాత ప్రభాస్ , రామ్ చరణ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేశారట .. అయితే అది అనుకోని కారణాల వల్ల అది షూటింగ్ కు వెళ్లలేదు .. ఇప్పటికీ దీనికి సంబంధించిన కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఇక తర్వాత సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ ను పెట్టి భారీ హీట్ కొట్టాడు రాజమౌళి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1350 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.
అయితే ప్రభాస్ తో మరోసారి చేస్తాడేమోనని రెబల్ స్టార్ అభిమానులు ఆశగా ఎదురుచూశారు కానీ రాజమౌళి అలా చేయలేదు .. ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .. ఇక ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తారన్నది అందరిలో ఉత్కంఠ గా నెలకొంది . ఇక రామ్ చరణ్ నుంచి గేమ్ ఛెంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెర్కకించాడు అలాగే దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక మరి ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు అందుకుంటారు చూడాలి.