2025 సమ్మర్ కి వచ్చే స్టార్ హీరోల సినిమాలు... ఎవరు ఎప్పుడు వస్తున్నారు.?

Amruth kumar
2024 వెళ్లిపోవటానికి మరికొన్ని గంటలే ఉంది .. ఇక దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ 2025 లో వచ్చే సినిమాల మీదే పడింది .. ఇప్పటికే సంక్రాంతికి డేట్స్ లాక్ అయిపోవడం తో సమ్మర్ డేట్స్ కూడా బిజీ బిజీ గా మారిపోయాయి .. ఒక్కో ఎనౌన్స్‌మెంట్ తో సమ్మర్ షెడ్యూల్స్ కూడా మంచి హైప్‌ గా మారిపోయాయి. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను 20025 మార్చి 28 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు . ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది .. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .

ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ మూవీ ది రాజాసాబ్‌  మూవీ ఏప్రిల్ 10 న ప్రేక్షకుల‌ ముందుకు రానుంది .. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రిద్ది కుమార్ హీరోయిన్స్ . ప్రస్తుతం స్టార్ ద‌ర్శ‌కుడు క్రిష్ దర్శకత్వం లో అనుష్క ప్రధాన పాత్రలో యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఘాటీ మూవీ కూడా 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18 న ప్రేక్షకులు ముందుకు రానుంది .

హనుమాన్ లాంటి పాన్ ఇండియా హిట్ తరవాత తేజ సజ్జ నటిస్తున్న పీరియాటిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ మిరాయి .. ఈ సినిమా కూడా ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది . కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ , మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. అలాగే సమ్మర్ రిలీజ్ కోసం భారీ సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి .. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న చిరంజీవి విశ్వంభర కూడా సమ్మర్ వార్ లోనే దిగేందుకు రెడీ అవుతుంది .. రిలీజ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. ఈ సమ్మర్ సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: